పత్తి కొనుగోళ్లలో సీసీఐ అధికారులు రూ.3 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారు అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సిద్దిపేటలో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు హరీష్ రావు.
కేవలం 20% పత్తి రైతులకు మాత్రమే మద్దతు ధర వచ్చింది, 80% పత్తిని బ్రోకర్లు రైతుల దగ్గర తక్కువ ధరకు కొని సీసీఐకు ఎక్కువ ధరకు అమ్ముకున్నారు అని దుయ్యబట్టారు. సీసీఐ అధికారుల పట్ల వెంటనే సీబీఐ దర్యాప్తు చేయాలి అన్నారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అందాల పోటీ పట్ల ఉన్న శ్రద్ధ రైతుల పట్ల లేదు అన్నారు. అందాల పోటీల గురించి పోటీ పడి సమీక్షలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, కొనుగోలు కేంద్రాల్లోనే కుప్పకూలుతున్న రైతున్నల గుండె కోత వినిపించడం లేదా? చెప్పాలన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా మార్కెట్ యార్డుల్లో ధాన్యం కొనుగోలు కోసం పడిగాపులు కాస్తూ ఇప్పటికే ఐదుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారు అన్నారు. ఇవి సహజ మరణాలు కాదు ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వ హత్యలే అని ఆరోపించారు.ఈ మరణాలకు ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి బాధ్యులు అన్నారు.
Also Read:శోభన్‌బాబు మనవడు.. గిన్నిస్ రికార్డు!

