శోభన్‌బాబు మనవడు.. గిన్నిస్ రికార్డు!

21
- Advertisement -

అలనాటి అందాల హీరో శోభన్ బాబు. ఎన్నో క్లాసిక్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు శోభన్ బాబు. ఆయన నటించిన చిత్రాలు ఇప్పటికి, ఎప్పటికి ఎవర్‌గ్రీనే. దక్షిణాదిన ఓ వెలుగువెలిగిన శోభన్ బాబు వారసులు ఇప్పటికి ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు.

తాజాగా శోభన్ బాబు వారసుడు, ఆయన మనవడు పేరు తెరపైకి వచ్చింది. శోభన్‌బాబు మనవడు సురక్షిత్ బత్తిన డాక్టర్‌గా సేవలందిస్తుండగా తాజాగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నాడు. శోభన్ బాబు కూతురు మృదుల కొడుకే సురక్షిత్.

తమిళనాడులో 44 ఏళ్ల మహిళ కొన్ని రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతోంది. స్కానింగ్‌లో ఆమె కడుపుతో భారీ కణితి ఏర్పడినట్టుగా గుర్తించారు. 3డీ ల్యాపరోసకోపీ సర్జరీ ద్వారా 8 గంటల పాటు శ్రమించి, 4.5 కిలోల గర్భాశయాన్ని తొలగించాడు డాక్టర్ సురక్షిత్ . గతంలో 2019లో డాక్టర్ రాకేశ్ సిన్హా 4.1 కిలోల గర్భాశయాన్ని ల్యాపరోస్కోపీ ద్వారా తొలగించి, గిన్నిస్ రికార్డు సాధిస్తే, ఇప్పుడు శోభన్ బాబు మనవడు ఆ రికార్డును బ్రేక్ చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు.

ఇన్‌స్టాగ్రామ్‌ dr_baby_maker ఖాతాకు 1.67లక్షల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు. ఇప్పటికే 40కి పైగా కీలక అవార్డులు, ధ్రువీకరణలు సాధించారు. కెరీర్‌లో 10వేలకు మించిన శస్త్రచికిత్సలు చేశారు.

Also Read:HIT 3:వంద కోట్ల క్లబ్‌లో హిట్3!

- Advertisement -