BRS:డల్లాస్ నగరంలో రజతోత్సవ వేడుకలు!

23
- Advertisement -

ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ చరిత్రలో నిలిచిపోయేలా జరిగింది , బీఆర్‌ఎస్‌ గ్లోబల్ ఎన్నారై కోఆర్డినేటర్‌ మహేష్‌ బిగాల మాట్లాడుతూ ఈ సభతో తెలంగాణ ప్రజలు మళ్లీ కేసీఆర్‌ వైపు చూస్తున్నారనే విషయం రుజువైందని పేర్కొన్నారు. నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం తొణికిసలాడుతున్నదని తెలిపారు, ఎల్కతుర్తిలో రజతోత్సవ వేడుకల్ని కొనసాగింపుగా రాబోయే సంవత్సర కాలం పాటు వివిధ దేశాలలో నిర్వహిస్తామని మహేష్ బిగాల తెలిపారు.

ముందుగా అమెరికా లోని డల్లాస్ నగరములో DR పెప్పర్ అరేనా లో జూన్ 1 2025 నాడు అట్టహాసంగా నిర్వహిస్తున్నారని తెలిపారు, ముఖ్య అతిధిగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీర్ గారిని ఆహ్వానించాం అని తెలిపారు , రాబోయే రోజుల్లో యూఎస్ఏ కాకుండా వివిధదేశాలలో నిర్వహిస్తారని అన్నారు ,ఈ కార్యక్రమాలకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీర్ గారితో పాటు ప్రముఖ నాయకులూ హాజరుకానున్నారని అన్నారు.పరాయి పాలనలో ప్రజలకు కష్టం వచ్చిన ప్రతిసారీ గులాబీ జెండా అండగా ఉన్నది. ఇప్పుడు కూడా పాలకులు తప్పు చేస్తే గాడిలో పెట్టే బాధ్యత తీసుకుంటున్నది. ఉద్యమం అన్నది జెండా ఊపిరిలోనే ఉన్నదని ఎల్కతుర్తి సభ మరోసారి రుజువు చేసింది. ఎందుకంటే ఈ గులాబీ వర్ణం రాజప్రాసాదాల పూదోటల నుంచి పుట్టింది కాదు, ఒక ప్రాంతపు ప్రజలు ఎదుర్కొన్న అవమానాలు, అన్యాయాలు, వివక్షల సాక్షిగా సంతరించుకున్నది!

బీఆర్ఎస్ యూఎస్ఏ అడ్వైజ‌రీ బోర్డు చైర్మన్ తన్నీరు మహేష్ మాట్లాడుతూ 2001 నుంచి బి ఆర్ ఎస్ వెంట నడుస్తున్నామని తెలిపారు. బి ఆర్ ఎస్ 25 వ వసంతం లోకి అడుగుపెట్టడం తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ ప్రజలకు గర్వకారణం అన్నారు. ఈ రజతోత్సవ వేడుకలను పెద్ద ఎత్తున వైభవం గా జరుపుతామన్నారు.అలాగే యూఎస్ఏ లో వున్నా వివిధ సంఘాలను, తెలంగాణ ఎన్ ఆర్ ఐ ప్రముఖులను సమన్వయం చేసుకొని పెద్ద ఎత్తున నిర్వహిస్తామని తెలిపారు, అమెరికాలోని వివిధ ప్రాంతాల నుండి ఈ కార్యక్రమానికి ఎన్ ఆర్ ఐ లు హాజరు అవుతారు అని అన్నారు. అలాగే పార్టీ 25ఏండ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకొని ఉత్తేజితమైన తెలంగాణ ఆటాపాటలతో కళాకారుల బృందం ప్రదర్శనలు వుంటాయని తెలిపారు.దేశ రాజకీయాల్లో అతిపెద్ద బహిరంగ సభల్లో ఒకటిగా రజోత్సవ వేడుక నిలిచిందని అమెరికాలో కూడా దానికి తీసిపోని విధంగా అట్టహాసంగా నిర్వహిస్తామని తెలిపారు.

Also Read:ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు అదిరే న్యూస్!

- Advertisement -