టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. డ్రాగన్ వర్కింగ్ టైటిల్‌తో సినిమా తెరకెక్కుతుండగా ప్రస్తుతం కర్ణాటకలో దర్శకుడు ప్రశాంత్ నీల్ పర్యవేక్షణలో షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా 2026 జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ చేయనున్నారు.
ఇక ఈ నెల 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్‌కు అదిరే ట్రీట్ ఇవ్వనున్నారు మేకర్స్. ఎన్టీఆర్‌నీల్ (వర్కింగ్ టైటిల్) సినిమా గ్లింప్స్ తో పాటు వార్ 2 సినిమా ఫస్ట్ లుక్ రానుంది. అలాగే ఈ సినిమా గ్లింప్స్‌ను కూడా విడుదల చేయనున్నట్లు సమాచారం.
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది.
Also Read:HIT 3:వంద కోట్ల క్లబ్‌లో హిట్3!

