ఎస్‌బీ ఆర్గానిక్స్ ప్రమాద బాధితులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రమాదంలో గాయపడి ఎంఎన్‌ఆర్ దవాఖానలో చికిత్స పొందుతున్న బాధితులను హరీశ్ రావు పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం,కంపెనీ ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు హరీష్.
ప్రమాద ఘటన చాలా దురదృష్టకరమని… ప్రమాదంలో గాయపడినవారిని గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. క్షతగాత్రులకు ప్రభుత్వం ఎలాంటి సహాయం అందించలేదని మండిపడ్డారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలన్నారు. గాయపడినవారికి రూ.25 లక్షల చొప్పున సహాయం చేయాలని బీఆర్‌ఎస్ పార్టీ డిమాండ్ చేశారు.
గాయపడినవారు ఎంత మంది ఉన్నారో కంపెనీ యాజమాన్యం చెప్పడం లేదని… కంపెనీ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులకు బీఆర్‌ఎస్ పార్టీ తరఫున సహాయం చేస్తామన్నారు.
Also Read:KTR:సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగలేఖ