Harshrao:కృష్ణా జలాలపై కాంగ్రెస్ వైఖరేంటీ?

34
- Advertisement -

తెలంగాణ కు ప్రాణప్రదమైనవి నీళ్లు…..రాజకీయాలు మాట్లాడాల్సిన టైమ్ లో మాట్లాడతాం అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టు గా మారబోతున్న అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని,రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక్కటవుదాం ..ఎన్నికలపుడు రాజకీయాలు మాట్లాడుకుందాం అన్నారు. ఉమ్మడి సాగు నీటి ప్రాజెక్టులు కేంద్రం చేతిలోకి అనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని, ఉమ్మడి ప్రాజెక్టులు krmb పరిధిలోకి వారం రోజుల్లోగా వెళతాయని నిన్న ఢిల్లీ లో జరిగిన ఉన్నత స్థాయి మీటింగ్ లో నిర్ణయమైనట్టుగా తెలుస్తోంది అన్నారు.

ఇదే జరిగితే ఏపీ కి లాభం తెలంగాణ కు నష్టం అని, జూలై 2021 లోనే కేంద్రం krmb పరిధిలోకి ఉమ్మడి ప్రాజెక్టులను తేవాలని కేంద్రం ప్రతిపాదించిందన్నారు. ఈ ప్రతిపాదనను కేసీఆర్ నాడు గట్టిగా వ్యతిరేకించారని, మేము ఆనాడు కొన్ని షరతులు పెట్టాం ..వాటిని ఇంకా కేంద్రం ఒప్పుకోలేదన్నారు. కృష్ణా జలాల్లో ఇంకా తెలంగాణ వాటా తేలినపుడు krmb పరిధిలోకి ఉమ్మడి ప్రాజెక్టులను ఎలా తెస్తారు
..కృష్ణా నీటిని ఏపీకి 50 శాతం తెలంగాణ కు 50 శాతం పంపిణీ చేయాలని కూడా షరతు పెట్టాం అన్నారు.

శ్రీశైలం నుంచి జల విద్యుత్ ఉత్పత్తి చేసి 264 టీఎంసీ ల నీటిని నాగార్జున సాగర్ కు విడుదల చేయాలని మరో షరతు పెట్టాం అని,ఏక పక్షం గా krmb పై నిర్ణయం తీసుకోకుండా అపెక్స్ కమిటీ వేయాలని మేము ఆనాడే కోరాం అన్నారు. ఒక సంవత్సరం లో వాడుకోని నీటిని మరో సంవత్సరం వాడుకునేలా వెసలు బాటు కనిపించాలని కేంద్రాన్ని నాడు కోరాం అని,ఆపరేషన్ మాన్యువల్ రూపొందించకుండా krmb పరిధిలోకి తెస్తారు ? అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం గుడ్డిగా krmb ఏర్పాటు కు ఒప్పుకున్నదని వార్తలు వస్తున్నాయని,.పాలమూరు రంగారెడ్డి కి జాతీయ హోదా కేంద్రం ఇవ్వమంటే ఒప్పుకున్నట్టే krmb కి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకున్నట్టు అనిపిస్తుందన్నారు. ఇది ఏపీ సీఎం జగన్ విజయం అన్నట్టు గా పత్రికలు రాస్తున్నయని,krmb పరిధి లోకి ఉమ్మడి ప్రాజెక్టులను తెస్తే జల విద్యుత్ ఉత్పత్తి పై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. దాదాపు 5 వేల మిలియన్ యూనిట్ల జల విద్యుత్ ను మనం కోల్పోతాం అని, రrmb చేతిలో ప్రాజెక్టులు పెడితే మనకు ఇష్టం ఉన్నపుడు విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఉండదు అన్నారు.

krmb కి దరఖాస్తు పెట్టి వాళ్ళు అనుమతించే లోపు గ్రిడ్ కుప్ప కూలుతుందని,జల విద్యుత్ ను కొన్ని సెకన్లలోనే ఉత్పత్తీ చేసుకోవచ్చు అన్నారు. అదే థర్మల్ విద్యుత్ ఉత్పత్తి మొదలు కావడానికి తొమ్మిది గంటలు పడుతుంది ..టెయిల్ పాండ్ ప్రాజెక్టు లో విద్యుత్ ఉత్పత్తి కి కూడా వీలు పడదు అన్నారు. నిర్మాణం లో ఉన్న ప్రాజెక్టుల పై కూడా krmb ప్రభావం ఉంటుందని,నాగార్జున సాగర్ ఎడమ గట్టు కాలువ ఆయకట్టు పై కూడా krmb ఎఫెక్ట్ ఉంటుందన్నారు. హైదరాబాద్ కు తాగు నీళ్లకు కూడా కట కట ఏర్పడుతుందని,krmb లో ఉమ్మడి ప్రాజెక్టులు చేరిస్తే తెలంగాణ కు ఆత్మహత్యా సదృశ్యమే
..ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలన్నారు. రాజకీయం మాని రాష్ట్రానికి జరిగే నష్టం గురించి కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించాలని,.రాష్ట్రం స్పందించకుంటే బీ ఆర్ ఎస్ పోరాటం చేయక తప్పదన్నారు.

Also Read:‘దీపికా పడుకోణె’తో ఐటెమ్ సాంగ్?

- Advertisement -