- Advertisement -
కరోనా నేపథ్యంలో సిద్దిపేట జిల్లాలో అమలవుతున్న లాక్ డౌన్ పరిస్థితులను పరిశీలించారు మంత్రి హరీష్ రావు. పట్టణం లో 2 సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ చేసే రెండు వాహనాలను ప్రారంభించిన మంత్రి… లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి బయట బైక్ లపై తిరిగే వారిపై కేసులు నమోదు చేయాలని,వారి బండ్లు సీజ్ చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
నిత్యవసర,అత్యవసర పనులకోసమే అనుమతిచ్చామని పనిలేకున్నా బయట తిరిగితే పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని చెప్పారు. స్వీయ నియంత్రణ ద్వారానే కరోనాకు అరికట్టవచ్చని… కరోనా నియంత్రణకు ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.
వైద్య సిబ్బంది,జిల్లా అధికారులు, పోలీసులు అహర్నిశలు శ్రమిస్తున్నారు..ప్రజలు బాధ్యతగా వ్యవహరించి ప్రభుత్వానికి సహకరించాలన్నారు. ఎవరూ ఆందోళన చెందవద్దు.. పుకార్లు నమ్మవద్దన్నారు.
- Advertisement -