- Advertisement -
తెలంగాణ వైతాళికుల్లో ఒకరు ఆర్. విద్యాసాగర్ రావు అని కొనియాడారు ఆర్థిక మంత్రి హరీశ్ రావు. నీటిపారుదల రంగ నిపుణులు ఆర్. విద్యాసాగర్ రావు జయంతి సందర్భంగా ట్విట్టర్‌లో చేసిన హరీష్… ఉద్యమ సమయంలో సాగు నీటి రంగంలో తెలంగాణ గడ్డకు జరుగుతున్న అన్యాయాన్ని ఎలుగెత్తి చాటిన మహనీయుడన్నారు.
సాగు నీటి రంగంలో జరిగిన అన్యాయాలు, ప్రాజెక్టుల్లో మోసంపై గణాంకాలతో జాతిని జాగృతం చేసిన గొప్ప వ్యక్తి విద్యాసాగర్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం తన పరిజ్ఞానంతో కొత్త ప్రాజెక్టుల రూపకల్పనలో ఆయన పాత్ర మరువలేనిదన్నారు. ఆర్ విద్యాసాగర్ రావు జయంతి సందర్భంగా ఆయన ఆశయాలకు అనుగుణంగా పని చేయడమే ఘనమైన నివాళి అన్నారు.
- Advertisement -