కూకట్‌పల్లిలో కేటీఆర్‌…100 కోట్లతో అభివృద్ధి పనులు

324
ktr

మంత్రి కేటీఆర్ కూకట్‌పల్లిలో పర్యటించారు. రూ. 100 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్ధాపన,ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో నిర్మించిన ఇండోర్ స్టేడియంను లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ జీహెచ్‌ఎంసీ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు.

స్థానిక క్రీడాకారులు ఈ స్టేడియాన్ని వినియోగించుకోవాలని, తద్వారా ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు కేటీఆర్. స్థానిక క్రీడాకారులకు ఈ స్టేడియం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. నగర యువత షటిల్ బ్యాడ్మింటన్‌పై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నందున ఈ స్టేడియంను నిర్మించినట్లు నగర మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో పాటు స్థానిక కార్పోరేటర్లు, క్రీడాకారులు, భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

ktr for kukatpally to inagurate rs 100 crores work ktr for kukatpally to inagurate rs 100 crores work