కరోనాకు మందు లేదు…ఇంట్లోనే ఉండాలని ప్రజలను కోరారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన… ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడొక ప్రత్యేక పరిస్థితిని ఎదుర్కొంటున్నామని… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంతో ఇక్కడ అదుపులో ఉందన్నారు.
అగ్రరాజ్యాలైన అమెరికా, ఇటలీ వంటి దేశాలు కరోనాతో విలవిలలాడుతున్నాయి… కేవలం 6 కోట్ల జనాభా ఉన్న ఇటలీ నే కరోనా ను అదుపు చేయలేక పోతున్నది.. అలాంటిది 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో కరోనా ఆదుపు తప్పితే పరిస్థితి ఎలా ఉంటుందో ఉహించాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు కరోనపై కొట్లాడుతూనే మరోవైవు రైతుల సంక్షేమానికి కృషి చేస్తోందని… ఊరూరికి సెంటర్లు పెట్టి మీ వద్దకే వచ్చి ధాన్యం కొంటున్నాం అన్నారు. రైతులు సహకరించాలి… పంట కోసిన తరువాత బాగా అరబెట్టి మికిచ్చిన టోకెన్ నెంబర్ ప్రకారం కొనుగోలు కేంద్రాలకు రావాలన్నారు.
అన్ని పంటలకు ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తున్నాం… రాష్ట్రంలో 14 కోట్ల గన్ని బ్యాగులు అవసరం ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో సగం ఉన్నాయి.. మిగతా సగం బ్యాగులు కోసం ప్రయత్నిస్తున్నాం అన్నారు. రైతులు కూడా పాత గన్ని బ్యాగులు ఉంటే తీసుకురావాలని… అకాల వర్షాలు వచ్చే అవకాశం ఉందన్నారు.
పంజాబ్ నుంచి 150 ప్యాడి మిషన్లు సిద్దిపేటకు తెప్పిస్తున్నామని.. లాక్ డౌన్ ఇంకో వారం, పదిహేను రోజులు పెంచినా ప్రజలు సహకరించాలన్నారు. కరోనాకు కులం, మతం లేదు అందరికి వస్తది.. బ్రిటన్ ప్రధానే కరోనాతో ఐసీయూలో ఉన్నారని చెప్పారు హరీష్.