భారత్‌లో కరోనా @ 5194

121
corona test labs

భారత్‌లో కరోనా బాధితుల సంఖ్య 5194కి చేరింది. 4643 మంది చికిత్స పొందుతుండగా మరణాల సంఖ్య 149కి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.

మొత్తం బాధితుల్లో 42 మంది కోలుకున్నారని దేశంలో నమోదైన కరోనా కేసుల్లో 70 మంది విదేశీయులే ఉన్నారని తెలిపింది. గత 24 గంటల్లో 773 పాజిటివ్ కేసులు నమోదుకాగా 35 మంది మృత్యువాత పడ్డారు.

దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 1018 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక తెలంగాణలో 404 కేసులు నమోదుకాగా 45 మంది కోలుకున్నారు. 11 మంది చనిపోయారు. ఏప్రిల్ 14తో లాక్ డౌన్ ముగుస్తున్న నేపథ్యంలో మరో వారం లేదా రెండు వారాలు పొడగించే అవకాశం ఉంది.