Pawan:వీరమల్లు మళ్లీ అటకెక్కింది!

21
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – క్రిష్ జాగర్లమూడి రచించి, దర్శకత్వం వహిస్తున్న భారీ హిస్టారికల్ డ్రామా ‘హరి హర వీర మల్లు’. పవన్ బర్త్ డే సందర్భంగా విడుదలైన పోస్టర్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఏ దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్ పై ఏఎమ్ రత్నం ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.తెలుగు, హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో విడుదల కానున్న ఈ పాన్-ఇండియన్ చిత్రం 17వ శతాబ్దానికి చెందిన చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడిన ఒక వ్యక్తి కథను చెబుతుంది.

అయితే షెడ్యూల్ ప్రకారం ఈ నెల మూడో వారం నుండి పవన్‌ షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉండగా టీ టౌన్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం పోస్ట్ పోన్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పవన్ షూటింగ్‌లో పాల్గొనే అవకాశం లేదని టాక్. దీంతో ఈ షెడ్యూల్ పోస్ట్ పోన్ కావడం ఖాయం అనిపిస్తోంది.

పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోండగా మొఘలులు మరియు కుతుబ్ షాహీ రాజుల కాలం నాటి కథాంశంతో రూపొందుతోంది.ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తుండగా విఎస్ జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Also Read:యూఎస్ ఓపెన్‌ విజేతగా జోకోవిచ్..

- Advertisement -