- Advertisement -
ప్రాంతీయ భాషా చిత్రాలతోనే జాతీయ స్థాయి గుర్తింపు పొందిన అతికొద్ది మంది కథానాయకులలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. ఆయన తన సినీ ప్రయాణంలో తొలిసారిగా ‘హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ అనే పీరియాడికల్ యాక్షన్ సినిమాలో నటిస్తున్నారు. ప్రేక్షకులకు ప్రత్యేకమైన మరియు మరపురాని థియేట్రికల్ అనుభవాన్ని అందించాలనే లక్ష్యంతో నిర్మాతలు భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోండగా ఆస్కార్ విన్నింగ్ స్వరకర్త ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. హరిహర వీరమల్లు మార్చి 28న థియేటర్లలోకి రానుందని చిత్ర బృందం ఇప్పటికే ధృవీకరించింది. తాజాగా హరిహర వీరమల్లు ఫస్ట్ సింగిల్ సాంగ్ రిలీజ్ అయింది. పవన్ స్వయంగా పాడిన ఈ పాట అందరిని ఆకట్టుకుంటోంది.
Also Read:అజిత్.. ‘పట్టుదల’ ట్రైలర్
- Advertisement -