ఫస్ట్ లుక్‌తో వచ్చిన హర్భజన్…

431
frienship
- Advertisement -

భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఫ్రెండ్ షిప్. తొలిసారిగా వెండితెరపై అలరించనున్న భజ్జి..ఫస్ట్ లుక్‌తో ప్రేక్షకుల ముందుకువచ్చేశాడు.

హ‌ర్భజన్ సింగ్‌, యాక్షన్ కింగ్ అర్జున్‌, ‌లోస్లియా మ‌రియ‌నేస‌న్ క‌లిసి ఉన్న ఈ ఫ‌స్ట్‌లుక్, మోష‌న్ పోస్టర్‌కి సోష‌ల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వ‌స్తోంది.

సీన్‌టొ స్టూడియోస్‌, సినీ మాస్ స్టూడియోస్ ప‌తాకాల‌పై జేపీఆర్, స్టాలిన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, త‌మిళ్‌, ఇంగ్లిష్ భాషల్లో సినిమా విడుదలకానుండగా ఈ చిత్రానికి జాన్ పాల్ రాజ్‌, శ్యామ్ సూర్య ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు.

- Advertisement -