భజ్జీ నా ఫేవరెట్: ఫించ్‌

267
harbhajan
- Advertisement -

భారత బౌలర్లలో హర్భజన్ సింగ్ తన ఫేవరెట్ బౌలర్‌ అని చెప్పుకొచ్చాడు ఆసీస్ కెప్టెన్ అరోన్ ఫించ్. పలు అంతర్జాతీయ టోర్నమెంట్‌లు రద్దు కావడంతో సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటున్న ఆటగాళ్లు అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నారు.

2019లో భారత్, ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ జరగగా.. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ చేసే సమయంలో తత్తరపాటుకి గురై క్రీజు కంటే చాలా దూరంలో ఉండి బంతిని విసిరాడు. భువీ విసిరిన ఆ బంతిని ఏం చేయాలో నాకు పాలుపోలేదు. దాంతో షాట్ కొట్టేందుకు కూడా ప్రయత్నించలేదు. అయితే తర్వాత బంతికే తాను ఎల్బీడబ్ల్యూగా ఔటై భువీకి వికెట్ సమర్పించుకున్నానని చెప్పాడు.

బాల్ టాంపరింగ్ కారణంగా స్టీవ్‌స్మిత్‌పై 2018లో ఏడాది నిషేధం వేటు పడటంతో అనూహ్యంగా ఆస్ట్రేలియా వన్డే, టీ20 కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నాడు అరోన్ ఫించ్.

- Advertisement -