ఎన్టీఆర్‌ లుక్‌ ప్రోమో…చరణ్‌ను మించిపోయేలా..!

457
ntr

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా మెగా అభిమానుల‌కు మంచి గిప్ట్ ఇచ్చారు ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి. రామ్ చ‌ర‌ణ్ ఎన్టీఆర్ హీరోలుగా తెర‌కెక్కుతున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఇవాళ చ‌ర‌ణ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆర్ఆర్ఆర్ మూవీలో చ‌ర‌ణ్ ఫ‌స్ట్ లుక్ ప్రొమో ను విడుద‌ల చేశారు అల్లూరి సీతారామరాజును పరిచయం చేస్తూ, ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ లో 1.13 నిమిషాల నిడివి వున్న ఫస్ట్ లుక్ టీజర్ అందరిని ఆకట్టుకుంది.

ఇక చరణ్‌ లుక్ తర్వాత ఎన్టీఆర్ లుక్ ఎలా ఉండనుందో అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. ఈ నేపథ్యంలో వారికి గుడ్ న్యూస్ అందించింది చిత్రయూనిట్. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే నేపథ్యంలో కొమరం భీమ్ గా ఇంట్రో కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చరణ్‌ లుక్ వీడియోని మించిపోయేలా ఎన్టీఆర్ వీడియో ఉండనుందట. ఈ మేరకు కొమరం భీమ్ గా ఎన్టీఆర్ ఎంట్రీ సునామీలా ఉండేలా తీర్చిదిద్దుతున్నారట జక్కన్న.

ఇక ఈ మూవీకి రౌద్రం రణం రుధిరం అనే టైటిల్ ను ఫైన‌ల్ చేయగా డీవీవీ దాన‌య్య నిర్మిస్తున్న ఈ సినిమా 2021జ‌న‌వ‌రి 8న విడుద‌ల కానుంది.