- Advertisement -
కడుపు మాడినా ఓర్చుకొని కన్న బిడ్డ ఆకలి తీర్చడానికి కత్తులతోనైనా పోరాడుతుంది అమ్మ.! తనకు కష్టమొస్తే కన్నీరు పెడుతుంది. బిడ్డకు నష్టమొస్తే ఎదురొచ్చే మిన్నునైనా బెదిరిస్తుంది.గుండెలు పెగిలినా భరిస్తుంది… కన్నపేగుకు కన్నీరొస్తే ఎంతకైనా తెగిస్తుంది.పునర్జన్మనెత్తుతూ బిడ్డకు జన్మనిస్తుంది అమ్మ. పొత్తిళ్లలో పసికందును చూసి ప్రసవవేదనను మరిచిపోతుంది. ఏడిస్తే స్తన్యమిచ్చి ఆకలితీరుస్తుంది అమ్మ. బుజ్జగిస్తూ బువ్వపెట్టి, జోలపాడి నిద్రపుచ్చుతుంది.
అమ్మ తన త్యాగపు పునాదులపై.. మన బతుకు సౌదాన్ని నిర్మించిన ఆ మాతృమూర్తికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం. కదిలే దేవతకు ఎలా కృతజ్ఞతలు చెప్పగలం. అమ్మ ప్రేమను కొనియాడడం తప్ప ఏమిచ్చి కొనలేము. ఆమే అమ్మ… ! నేడు అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా.. మా గ్రేట్ తెలంగాణ.కామ్ తరుపున మాతృదినోత్సవం శుభాకాంక్షలు తెలిజేస్తున్నాయి.
- Advertisement -