ప్రాణం పోసేది దైవం.. ప్రాణిని మోసేది అమ్మ . .

178
TRS MP Joginpally Santosh Kumar

మాతృదినోత్సవ సందర్బంగా టీఆర్ఎస్‌ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ మదర్స్‌ డే శుభాకాంక్షలు తెలియజేశారు. అన్ని బంధాలకు వారధి కుటుంబ వ్వవస్థకు సారథిగా ఉంటూ తన పిల్లలు ఉన్నత స్థానాల్లో ఉండాలని ప్రతి తల్లి కోరుకుంటుంది. ఎన్ని బాధ్యతలు ఉన్న తప్పు చేసిన పిల్లలను మొదట్లో దండిస్తూ సన్మార్గంలో నడిపిస్తూ కుటుంబ వారథిగా, సారథి అమ్మ.

ఒకప్పుడు వంటగదికి మాత్రమే పరిమితమైన అమ్మ బాధ్యతలు నేడు బహుళంగా పెరిగాయి. భార్యగా, తల్లిగా, ఉద్యోగిగా, సమాజంలో అసమనతలు ఎండగడుతూ ఆరోగ్య సమాజ నిర్మాణానికి అనేక బాధ్యతలు చేపడుతుంది. బిడ్డల బాగుకోరుతూ, తను కష్టాలు పడుతూ వారిని కంటిరెప్పలగా కాపాడుకుంటూ ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటున్న అమ్మకు మదర్సే డే సందర్భంగా మనస్పూర్తిగా వందనం.

 

TRS MP Joginpally Santosh Kumar