ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నర్సింహన్ శుక్రవారం 70వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా పుట్టినరోజు వేడుకలను రాజ్‌భవన్‌లో కుటుంబసభ్యులు, అధికారులు, సిబ్బంది సమక్షంలో నిరాడంబరంగా నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ…ఫోన్ లో గవర్నర్ కు పుట్టినరోజు విషెస్ తెలియజేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు…గవర్నర్ నరసింహన్‌ను కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.గవర్నర్ కు కేక్ తినిపించి విషెస్ తెలిపారు. శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గవర్నర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఐపీఎస్ అధికారిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. జన్మదిన వేడుకలను రాజ్‌భవన్‌లో నిరాడంబరంగా జరుపుకోవాలని గవర్నర్ నిర్ణయించినట్లు రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి.
1946లో జన్మించిన నరసింహన్ మద్రాసు విశ్వవిద్యాలయములో భౌతిక శాస్త్రంలో పట్టా పుచ్చుకున్నాడు. రాజకీయ శాస్త్రంలో ఉన్నత పట్టా చదివాడు. మద్రాసు న్యాయ విశ్వవిద్యాలయము నుండి ఎల్ఎల్‌బీ పూర్తి చేశాడు. 1968లో భారత పోలీసుశాఖలో చేరారు. ఇంటిలిజెన్స్ బ్యూరో ప్రధాన అధికారిగా పనిచేసి 2006 లో ఉద్యోగ విరమణ చేశారు. ఆ తరువాత మాస్కో రాయబారిగా పనిచేశారు. తర్వాత ఛత్తీస్‌గడ్ రాష్ట్రానికి మూడవ గవర్నర్ గా పనిచేసి డిసెంబర్ 28, 2009న అదనపు బాధ్యతగా 22 వ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం జనవరి 22, 2010న పూర్తి స్థాయిలో గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర విభజన అనంతరం ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
2009లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి తన పుట్టినరోజును హైదరాబాద్‌లోనే జరుపుకుంటున్నారు.