పీవీ సింధును సన్మానించిన గవర్నర్

381
pv sindhu governer
- Advertisement -

ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో స్వర్ణం గెలుచుకున్న పీవీ సింధుకు రాజ్ భవన్ లో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. రాజ్ భవన్ దర్బార్ హాల్ లో పీవీ సింధును గవర్నర్ నరసింహన్ సన్మానించారు. అనంతరం పారా షట్లర్ మానసి జోషిని గవర్నర్ నరసింహన్ దంపతులు సన్మానించారు. ఈకార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, కోచ్ పుల్లెల గోపీచంద్, పీవీ సింధు కుటుంబసభ్యులు, పలువురు క్రీడా ప్రముఖులు పాల్గొన్నారు.

governer pv sindu

ఈసందర్భంగా గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ… సింధు వరల్డ్ ఛాంపీయన్ షిప్ గెలవడం గర్వకారణంగా ఉందన్నారు. రాబోయే ఒలంపిక్స్ లో సింధుకు గోల్డ్ మెడల్ రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. మానసి జోషి ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తుందన్నారు. భవిష్యత్ లో సింధు మరింత ఎత్తుకు ఎదగాలని కొరకుంటున్నట్లు తెలిపారు. పీవీ సింధు మాట్లాడుతూ.. వచ్చే ఒలంపిక్స్ లో ఖచ్చితంగా గోల్డ్ మెడల్ సాధిస్తానని చెప్పారు. నా గెలుపు సహాకరించిన కోచ్ పుల్లెల గోపిచంద్ కు ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -