ఏపీ ప్రజలను తానెప్పటికీ మర్చిపోలేనుః గవర్నర్ నరసింహన్

294
Jagan Governar Narasimhan
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ ప్రజలను తాను ఎప్పటికి మర్చిపోనన్నారు గవర్నర్ నరసింహన్. ఆంధ్రప్రదేశ్ కు కొత్త గవర్నర్ ను నియమించడంతో నిన్న విజయవాడలోని గేట్ వే హోటల్ లో వీడ్కోలు కార్యక్రమం నిర్వహించింది ఏపీ ప్రభుత్వం. ఈ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దంపతులతో పాటు అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గోన్నారు.

ys-jagan-mohan-reddy2

ఈసందర్భంగా గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ..ఇన్ని రోజులు ఏపీ గవర్నర్ గా పనిచేసినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. తాను తెలిసో, తెలియకో తప్పులు చేసి ఉంటే క్షమించాలని గవర్నర్ నరసింహన్ కోరారు. నకు సహకరించిన అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ఏపీతో తనకు అవినాభావ సంబంధం ఉందన్న నరసింహన్.. 1951లో విజయవాడలోనే తనకు అక్షరాభ్యాసం జరిగిందన్నారు.

 సీఎం జగన్ మాట్లాడుతూ.. ఏపీ గవర్నర్ గా నరసింహన్ మరికొద్ది రోజులు ఉంటే బాగుండేదన్నారు. నాన్నగారిలా నాకు వెనక నుంచి సలహాలు ఇచ్చారని చెప్పారు. ఏపీ ప్రజలు తమరిని ఎప్పటికి గుర్తుంచుకుంటారని చెప్పారు. నేను సీఎం అయ్యాక నన్ను ముందుండి నడిపించారని చెప్పారు.

- Advertisement -