ప్రేమమ్ మూవీతో యూత్‌ని అట్రాక్ట్ చేసిన భామ సాయి పల్లవి. మెగా హీరో వరుణ్ తేజ్‌తో కలిసి భానుమతి సింగిల్ పీస్ అంటూ ప్రేక్షకులను ఫుల్ ‘ఫిదా’ చేసేసింది. ‘ఫిదా’ మూవీలో ఈ హైబ్రీడ్ పిల్లకు ఫిదా కాని కుర్రకారు లేరు అంటే అతిశయోక్తికాదు. మలయాళీ అయినప్పటికీ తెలుగు అందులోనూ తెలంగాణ యాసను నేర్చుకుని ‘బాద్మాష్ బొక్కలిరిగిపోయాయ్ బలిసిందారా’ అంటూ.. అందరినీ ఫిదా చేసేసింది ఈ బ్యూటీ. ఇవాళ సాయి పల్లవి పుట్టినరోజు.
భానుమతి క్యారెక్టర్ తో జనాల మనసుల్లో స్థానం పొందిన ఈ అమ్మడుకి ఇప్పుడు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ జనాల్లో అత్యంత క్రేజీ పర్సన్ సాయి పల్లవి. ఏకంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఆమె యాక్టింగ్ కు ఫిదా అయ్యారు. ఆమెకు తెలంగాణ చరిత్రకు సంబంధించిన ఒక పుస్తకాన్ని కూడా బహుమతిగా ఇచ్చారు.
ఈ ముద్దుగుమ్మను సాయి పల్లవి అని పిలువడం మానేసి భాన్సువాడ భానుమతి అనే పేరుతో పిలవడం మొదలుపెట్టారు. సినీ పరిశ్రమలో వేదిక ఏదైనా గానీ, కార్యక్రమం ఏదైనా సాయి పల్లవి నామస్మరణతో మార్మోగిపోయింది. తనకున్న క్రేజ్‌ని దృష్టిని ఉంచుకుని దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనుకుందేమో ఈ బ్యూటీ తెలియదు కానీ రెమ్యూనరేషన్ ను భారీగా పెంచింది.
నానితో ఎంసీఏ చిత్రంలో అలరించిన ఈ బ్యూటీ నాగశౌర్యతో కణం సినిమాతో మెప్పించింది. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరోల్లో విభిన్నమైన…విలక్షణమైన కథలతో సక్సెస్ బాట పట్టిన హీరో శర్వానంద్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. అందాల రాక్షసి,కృష్ణగాడి వీర ప్రేమకథ,లై సినిమాలతో ఆకట్టుకున్న హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు పడి పడి లేచే వయసు అనే టైటిల్‌ని ఖరారు చేశారు. సాయి పల్లవి బర్త్ డే సందర్భంగా స్పెషల్ పోస్టర్‌ని విడుదల చేసిన చిత్రయూనిట్ శుభాకాంక్షలు తెలిపింది. మొత్తానికి చేసింది తక్కువ సినిమాలే అయినా స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి కెరీర్‌లో మరిన్ని సక్సెస్‌లను అందుకోవాలని greattelangaana.com మనస్పూర్తిగా కొరుకుంటోంది.