Nithin:హ్యాపీ బర్త్ డే…నితిన్

1143
nithin birthday
- Advertisement -

తొలి సినిమా జయంతోనే యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో నితిన్. ఫస్ట్ సినిమానే సూపర్‌ హిట్‌ కావడంతో ఫుల్ జోష్‌తో వరుస సినిమాలు చేస్తూ యూత్ హీరోగా పేరు తెచ్చుకున్నారు.ఎన్. సుధాకర్ రెడ్డి తనయుడైన నితిన్ తొలి సినిమాతోనే ఫిలింఫేర్ అవార్డ్ ను అందుకున్నాడు . తర్వాత దిల్, సై, ఇష్క్‌, గుండెజారి గల్లంతయ్యిందే లాంటి యూత్‌పుల్‌ చిత్రాలతో మాస్ ఆడియన్స్‌ని ఆకట్టుకున్నాడు. సంబరం , శ్రీ ఆంజనేయం, ధైర్యం, అల్లరి, బుల్లోడు, రామ్,విక్టరీ సినిమాలు తీసినా పెద్దగా ఆకట్టుకోలేక పోయారు. విక్టరీ సినిమాతో సిక్స్ ప్యాక్‌తో కనిపించిన నితిన్ ఫ్యాన్స్‌ను సంపాదించకున్నారు.

వరుస పరాజయాల బాట నుండి త్రివిక్రమ్ అ..ఆ!తో గట్టెక్కిన నితిన్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నారు.ఇటీవలే ”చెక్, రంగ్ దే” సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆయన జూన్ నెలలో తన లేటెస్ట్ ప్రాజెక్టు ‘మాస్ట్రో’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఓ వైపు పరాజయాలు పలకరిస్తున్నా, తన క్రేజ్ ను నిలబెట్టుకోవడానికి కష్టపడుతూనే ఉన్నారు నితిన్. ఇక ఇవాళ నితిన్ బర్త్ డే సందర్భంగా పవన్ టైటిల్‌ తమ్ముడు సినిమా ఫస్ట్ లుక్‌ని రివీల్ చేశారు. నితిన్ తన కెరీర్‌లో మరింత సక్సెస్ అందించాలని కోరుకుంటూ మరోసారి greattelangaana.com పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది.

Also Read:భోజనానికి ముందు పెరుగు తింటే?

- Advertisement -