రివ్యూ : హ్యాపీ బ‌ర్త్ డే

216
Happy Birthday movie review
- Advertisement -

లావ‌ణ్య త్రిపాఠి ప్ర‌ధాన‌పాత్ర‌లో రితేష్ రానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం హ్యాపీ బ‌ర్త్ డే. వినూత్న ప్రచార కార్యక్రమాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా ఇవాళ ప్రేక్ష‌కుల ముందుకువ‌చ్చింది. మ‌రి ఆ అంచ‌నాల‌ను ఈ సినిమా అందుకుందా లేదా చూద్దాం..

కథ:
ఆయుధ వినియోగ సవరణ చట్టాన్ని తీసుకొచ్చిన కేంద్ర మంత్రి రితిక్ సోది (వెన్నెల కిషోర్ ) ప్రతిఫలంగా రష్యా ఆయుధ డీలర్ వ్లాదిమిర్ యురినిక్ నుంచి వేల కోట్ల రూపాయల భారీ మొత్తంలో డబ్బు ముడుపులు తీసుకునేందుకు ఒప్పందం చేసుకుంటాడు. భారీ మొత్తం చేతులు మారుతుందని తెలిసిన గుండా ( రాహుల్ రామకృష్ణ), హోటల్ వెయిటర్ లక్కీ (నరేష్ అగస్త్య)తో విదేశీయుడి నుంచి పెన్ డ్రైవ్ దొంగతనం చేయించాలని ప్రయత్నిస్తుంటాడు. ఆ క్రమంలో ఆ పెన్ డ్రైవ్ హ్యాపీ (లావణ్య త్రిపాఠి) హ్యాండ్ బ్యాగ్ లోకి చేరుతుంది. త‌ర్వాత ఏం జ‌రుగుతుంది..పెన్ డ్రైవ్ ఎవ‌రికి దొరుకుతుంది…? చివ‌రికి డ‌బ్బులు ఎవ‌రు ద‌క్కించుకుంటార‌నేదే సినిమా క‌థ‌.

ఫ్లస్ పాయింట్స్:
సినిమాలో మేజ‌ర్ ప్ల‌స్ పాయింట్స్ లావ‌ణ్య త్రిపాఠి న‌ట‌న‌, నేపథ్యం, కామెడీ. వేల కోట్ల రూపాయల డబ్బు చుట్టూ కథ సాగడం కొత్త‌గా అనిపిస్తుంది. లావణ్య త్రిపాఠి న‌ట‌న సినిమాకు ప్ల‌స్ పాయింట్‌గా మారింది. ఇలాంటి క్యారెక్టర్ ఆమెకు మళ్లీ దొరక్కపోవచ్చు. మిగిలిన పాత్ర‌ల్లో సత్య బాగా నవ్వించాడు, వెన్నెల కిషోర్, లక్కీ పాత్రలో నరేష్ అగస్త్య తన పరిధి మేరకు మెప్పించాడు.

మైనస్ పాయింట్స్:
సినిమాలో మేజ‌ర్ మైన‌స్ పాయింట్స్ క‌థ‌, పాత్ర‌ల ఎంపిక‌.

సాంకేతిక విభాగం:
సాంకేతికంగా సినిమా ప‌ర్వాలేద‌నిపిస్తుంది. సినిమా చూస్తున్నంత సేపు ఒక కొత్త నేపథ్యాన్ని అనుభూతి చెందుతాం. పాత్రల ప్రవర్తన, వాటిని డిజైన్ చేసిన తీరు, అవి మాట్లాడే డైలాగ్స్, అనుగుణమైన నేపథ్య సంగీతం అన్ని బాగున్నాయి. ఎడిటింగ్, సినిమాటోగ్ర‌ఫీ బాగుంది. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.

తీర్పు:
జాతిరత్నాలు స్టైల్లో ప్రతి పాత్ర ద్వారా, ప్రతి సన్నివేశం ద్వారా వీలైనంత నవ్వించే ప్రయత్నం చేసిన దర్శకుడు రితేష్ రానా…ఈ సినిమాలోనూ అదే ప్ర‌య‌త్నం చేశాడు. కామెడీ బాగున్నా క‌థ‌పై కాస్త దృష్టిసారిస్తే బాగుండేది. ఓవ‌రాల్‌గా ఈ వీకెండ్‌లో ఓసారి చూడ‌ద‌గ్గ చిత్రం హ్యాపీ బ‌ర్త్ డే.

విడుద‌ల తేదీ: 08/07/2022
రేటింగ్:2.25/5
నటీనటులు : లావణ్య త్రిపాఠి, సత్య
సంగీతం :కాలభైరవ
నిర్మాణం : క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్‌
దర్శకత్వం –:రితేష్ రానా

- Advertisement -