హీరో విక్ర‌మ్‌కు గుండెపోటు

34
vikram
- Advertisement -

షాకింగ్ హీరో విక్ర‌మ్ గుండెపోటుకు గుర‌య్యారు. ఇవాళ ఉద‌యం హార్ట్ ఎటాక్ రావ‌డంతో వెంట‌నే చెన్నైలోని కావేరీ హాస్పిట‌ల్‌కు విక్ర‌మ్‌ను త‌ర‌లించారు. శుక్ర‌వారం సాయంత్రం జ‌ర‌గాల్సిన ‘పొన్నియిన్ సెల్వ‌న్’ టీజ‌ర్ లాంఛ్ కార్య‌క్ర‌మానికి విక్ర‌మ్ హాజ‌రు కావాల్సి ఉండ‌గా ఆయ‌న గుండెపోటు భారీన ప‌డ‌టం అభిమానుల‌ను షాక్‌కు గురిచేసింది.

శివ‌పుత్రుడు సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యమ‌య్యాడు విక్ర‌మ్. అప‌రిచితుడు త‌ర్వాత‌ వ‌రుస‌గా ‘మ‌ల్ల‌న్న‌’, ‘విల‌న్‌’, ‘ఐ-మ‌నోహ‌రుడు’, ‘ఇంకొక్క‌డు’ వంటి సినిమాలు తెలుగులో మంచి విజ‌యాలు సాధించాయి. ఇక విక్ర‌మ్ న‌టించిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ‘కోబ్రా’ ఆగ‌స్టు 11న విడుద‌ల కానుంది.

- Advertisement -