భారతదేశంలోని అత్యంత సంతోషకరమైన రాష్ట్రంగా ఈశాన్య రాష్ట్రమైన మిజోరం నిలిచింది. తాజాగా ఓ అధ్యయనం ఈ విషయాన్ని తెలిపింది. గురుగ్రామ్‌లోని మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన స్ట్రాటెజీ ప్రొఫెసర్ రాజేశ్ కే పిలానియా దీన్నిపై అధ్యయనం చేశారు. అన్ని రాష్ట్రాల్లో కెల్లా మిజోరం అత్యంత సంతోషకరమైన రాష్ట్రంగా ఉందని నివేదికలో వెల్లడించారు.
Also read: Bharath : ప్రపంచ జనాభాలో మనమే టాప్..!
ఏదైనా ఒక రాష్ట్రం సంతోషకరమైన రాష్ట్రంగా గుర్తించాలంటే ఆరు రకాల అంశాలను ఎంచుకున్నట్టు తెలిపారు. వాటిలో కుటుంబ బంధాలు సామాజిక సమస్యలు వృత్తి మతం కొవిడ్-19 ప్రభావం దాతృత్వం ఈ అంశాలను ప్రతిపాదిక చేసుకొని ఈ సర్వే నిర్వహించారు. ఈ అంశాలు ప్రజల శారీరక మానసిక ఆరోగ్యంపై ఎటువంటి ప్రభావం చూపుతున్నాయో పరిశీలించి మిజోరంను అత్యంత హ్యాపీయెస్ట్ రాష్ట్రంగా గుర్తించారు.
Also read: అత్యంత సంపన్న నగరాల జాబితాలో మన హైదరాబాద్..
మిజోరంలో సామాజిక నిర్మాణం కూడా అక్కడియువత ఆనందానికి దోహదం చేస్తుందని తెలిపారు. అలాగే ఏ పని చాలా చిన్నదిగా పరిగణించరని… సాధారణంగా యువత 16,17యేళ్ల వయస్సులోనే ఉపాధిని పొందుతారని నివేదికల్లో పేర్కొన్నారు. ఉపాధి విషయంలో ప్రోత్సహించడంలో ఎటువంటి వివక్ష చూపించలేరని వెల్లడించారు. మిజోరంలో విడిపోయే కుటుంబాల సంఖ్య ఎక్కువగా ఉంది. అయితే క్లిష్ట సమయంలో మాత్రం అందరూ ఒక్కటి అవుతారని తమ నివేదికల్లో పేర్కొన్నారు.