నిజం ఒప్పుకున్న నరహంతకుడు శ్రీనివాస్ రెడ్డి

308
hazipur-rapist
- Advertisement -

తెలంగాణలో సంచలనం సృష్టించిన హాజీపూర్ హత్యలపై కీలక విషయాలు వెల్లడించారు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్. యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్ లో ఈనెల 25న తన కుమార్తె అదృశ్య మైనట్టు శ్రావణి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. శ్రావణి ఆచూకీ కోసం ఈనెల 27న సిట్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామన్నా,రు. పోలీసులు విచారణ అనంతరం నిజాన్ని ఒప్పుకున్నాడు హంతకుడు శ్రీనివాస్ రెడ్డి. నాలుగు సంవత్సరాల కింద అదృశ్యమైన కల్పనను తానే హతమార్చినట్టు అంగీకరించాడు.

ప్రస్తుతం శ్రీనివాస్ రెడ్డి బొమ్మల రామారం పోలీసులు అదుపులో ఉన్నట్లు తెలిపారు. మరోవైపు హాజిపూర్ లోని శ్రీనివాస్ రెడ్డి ఇంటికి నిప్పంటించారు గ్రామస్తులు. ఇటీవలే అదృశ్యమై పోడు బావిలో శవమై తేలిన శ్రావణితోపాటు మరో ఇద్దరమ్మా యిలు కల్పన మనీషా హత్యలకు కూడా శ్రీనివాస రెడ్డే కారణమన్నది పోలీసుల అను మానం కీసర నుంచి శ్రావణిని బైక్‌పై తీసుకెళ్లినట్లు సీసీ ఫుటేజీ సాక్ష్యం కూడా వుంది. రెండు మృతదేహాలు దొరికిన బావి కూడా అతనిదే కావడంతో శ్రీనివాస్ రెడ్డి ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని అనుమానించారు పోలీసులు.

గతంలో శ్రీనివాస్ రెడ్డి కర్నూలులో ఓ మహిళను హతమార్చినట్టు అతనిపై ఎఫ్ ఐ ఆర్ నమోదైంది. బొమ్మల రామారం నుంచి హాజీపూర్‌కు4 కిలోమీటర్ల దూరం ఎక్కువమంది కాలినడకనే చేరు కుంటారు. దీన్నే అవకాశంగా తీసుకుని శ్రీనివాసరెడ్డి అమ్మయిలపై ఆఘాయిత్యానికి పాల్పడేవాడట. ఇన్ని హత్యలు చేసిన శ్రీనివాస్ రెడ్డిని వెంటనే ఉరితీయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -