జాతిపిత మహాత్మా గాంధీ జీ వర్ధంతి సందర్భంగా తెలంగాణ శాసన సభ ప్రాంగణంలో మహాత్మాగాంధీ జీ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన గుత్తా సుఖేందర్ రెడ్డి…దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి గాంధీజీ తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయులు అన్నారు.శాంతియుత మార్గం ద్వారా భారతదేశానికి స్వాతంత్రం తీసుకువచ్చి మన అందరి గుండెల్లో గాంధీజీ నిలిచారన్నారు. గ్రామలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది అని చెప్పిన మహనీయులు గాంధీజీ అని కొనియాడారు.
గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు రాష్టాన్ని ముందుకు తీసుకుపోతున్నారని తెలిపిన గుత్తా..గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని తెలంగాణ రాష్ట్రం సాధించి దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. నేటి యువత గాంధీజీ త్యాగాన్ని తెలుసుకుని ఆయన చూపిన మార్గంలో ప్రయాణిస్తూ వారు ఎంచుకున్నలక్ష్యాలను సాధించాలన్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, హోం మినిష్టర్ మహమూద్ అలీ,సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, చీప్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు,విప్ గొంగిడి సునీత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత,ఎమ్మెల్సీ దయనంద్,అసెంబ్లీ సెక్రెటరీ డా” నర్సింహా చార్యులు,టి ఆర్ యస్ ఎల్పీ కార్యదర్శి రమేష్ రెడ్డి పాల్గొన్నారు.