గురుగ్రామ్‌లో పవర్ కట్..అప్‌డేట్

3
- Advertisement -

ఢిల్లీ సరిహద్దు నగరమైన గురుగ్రామ్‌లో శుక్రవారం రాత్రి తలెత్తిన భారీ విద్యుత్ అంతరాయం (పవర్ అవుటేజ్) సమస్య ఎట్టకేలకు పరిష్కారమైంది. సెకటర్-72లోని 220 KVA విద్యుత్ సబ్‌స్టేషన్‌లోని ప్రధాన ట్రాన్స్‌ఫార్మర్‌లో అగ్నిప్రమాదం సంభవించడంతో నగరంలోని పలు ప్రాంతాలు చీకట్లోకి వెళ్ళిపోయాయి. శనివారం నాటికి పరిస్థితిని అదుపులోకి తెచ్చి, విద్యుత్ సరఫరాను పూర్తిగా పునరుద్ధరించినట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అనిల్ మాలిక్ తెలిపారు.

ఈ ప్రమాదంపై ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అనిల్ మాలిక్ మాట్లాడుతూ.. శుక్రవారం రాత్రి సుమారు 7:50 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 220 KVA కరెంట్ ట్రాన్స్‌ఫార్మర్‌లో ఆయిల్ లీకేజీ సంభవించింది. ఆపరేటర్ బ్రేకర్ కట్ చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలోనే ఒక్కసారిగా పేలుడు సంభవించి, మంటలు వ్యాపించాయి. దీంతో నగరం ఒక్కసారిగా బ్లాకౌట్ అయిందని తెలిపారు.

దీని కారణంగా సెక్టార్-52, 56 సహా ఐదు సబ్‌స్టేషన్లకు సరఫరా నిలిచిపోయిందని, అలాగే రాపిడ్ మెట్రో సేవలకు కూడా అంతరాయం కలిగిందని ఆయన చెప్పారు. అయితే రాత్రి 8:25 గంటలకే మెట్రో సేవలను పునరుద్ధరించామని, ప్రస్తుతం థర్మల్ హీటింగ్ వల్ల జరిగిన ఈ ప్రమాదం నుండి వ్యవస్థను పూర్తిగా బాగు చేసి, పరిస్థితిని అదుపులోకి తెచ్చామని స్పష్టం చేశారు.

Also Read:చిన్నతనంలో జంక్ ఫుడ్..షాకింగ్!

- Advertisement -