సంక్రాంతి కానుకగా విక్టరీ వెంకటేశ్ అభిమానులకు గురు ట్రైలర్‌ను కానుకగా అందించాడు. యూ ట్యూబ్‌లో విడుదలైన ఈ టీజర్ వీడియోను తన ఫేస్ బుక్ ద్వారా పంచుకున్నారు వెంకీ. బాక్సింగే తన ప్రపంచమని… ‘మీరు నేను చెప్పిందే వింటారు.. చెప్పిందే తింటారు. ఇల్లు, వాకిలి, ప్రేమ, దోమ, చెత్తాచెదారం అన్ని పక్కనపెట్టి ఒళ్లొంచి ట్రై చేయండి’ అని టీజర్‌లో వెంకీ చెప్పే డైలాగ్ అభిమానులకు ఆకట్టుకుంటుంది.
దీనిపై సోషల్ మీడియాలో తమ కామెంట్లను పోస్టు చేస్తున్నారు. వెంకీ ఈజ్ బ్యాక్, సూపర్ వెంకీ సర్, చక్కగా ఉంది, చిత్రం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాం..’ అని ఫ్యాన్స్ కామెంట్లను షేర్ చేసుకుంటున్నారు. ‘సాలా ఖడూస్’ అనే బాలీవుడ్ చిత్రానికి రీమేక్‌గా సుధ కొంగర ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఇక తొలిసారిగా ఈ సినిమాలో వెంకీ ఓ పాటపాడాడు. వెంకటేష్ బర్త్ డే సందర్భంగా జిగిడి…జిగిడి అంటూ హమ్మింగ్‌తో సాగుతున్న పాటను అభిమానులకు కానుకగా అందించాడు. వెంకీ బాక్సర్‌గా నటిస్తున్న ఈసినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో హై ఎక్స్ పెక్టేషన్స్ నెలకొన్నాయి.