లుక్‌తోనే కాదు ట్రైలర్‌తోను అదరగొట్టిన రానా

237
Ghazi Telugu Movie Official Trailer
- Advertisement -

టాలీవుడ్ మ్యాన్లీ హంక్ రానా హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఘాజీ. 1971లో జరిగిన భారత్ , పాకిస్థాన్ యుద్ధ సమయంలో సముద్ర గర్భంలో అదృశ్యమయిన సబ్ మెరైన్ ‘ఘాజీ’ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. రానా నావెల్ ఆఫీసర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో సంకల్ప్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఫిబ్రవరి 17న రిలీజ్ అవుతోంది.

తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఘాజీలో రానా సరసన నటించే అవకాశాన్ని కొట్టేసింది తాప్సీ. ఇటీవల సినిమా టైటిల్ లోగోను విడుదల చేసిన చిత్రయూనిట్.. నావెల్ ఆఫీసర్ యూనిఫాంలో ఉన్న రానా ఫోటోను కూడా విడుదల చేసింది. తాజాగా సినిమాలో అనన్యగా నటిస్తున్న తాప్సీ ఫోటోని విడుదల చేసింది.

Ghazi Telugu Movie Official Trailer

ఇక సంక్రాంతి కానుకగా ఘాజీ ట్రైలర్ విడుదలైంది. ఇప్పటికే ఘాజీ పోస్టర్‌తో అదరగొట్టిన రానా….ట్రైలర్‌తో రెచ్చిపోయాడు. దీంతో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఆ ట్రైలర్ మీకోసం…

- Advertisement -