‘నీవెవ‌రో’ ట్రైల‌ర్ రిలీజ్..

294
Neevevaro Movie Trailer
- Advertisement -

ఆది పినిశెట్టి హీరోగా నటిస్తున్న చిత్రం ‘నీవెవ‌రో’. హ‌రినాథ్‌ ద‌ర్శ‌క‌త్వంలో వహిస్తున్న నీవెవ‌రో మూవీలో ఆది పినిశెట్టి అంధుడిగా న‌టిస్తున్నాడ‌ని తెలుస్తుంది. కోన ఫిల్మ్ కార్పొరేష‌న్ ప్ర‌స్తుతం ఎమ్‌వీవీ సినిమాస్‌తో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాప్సీ, రితికా సింగ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.

రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ ట్రైల‌ర్ తాజాగా విడుద‌లైంది. ఇందులో వెన్నెల కిషోర్, స‌ప్త‌గిరిల కామెడీ సినిమాపై అంచ‌నాలు పెంచుతుంది. థ్రిల్లింగ్ ల‌వ్ స్టోరీగా మూవీ ప్రేక్ష‌కుల‌ని త‌ప్ప‌క మెప్పిస్తుంద‌ని అంటున్నారు. ఈ సినిమాకు సాయి శ్రీరామ్ సినిమాటోగ్ర‌ఫీ అందించ‌గా, చిన్నా బాణీలు స‌మ‌కూర్చారు. ఆగ‌స్ట్ 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -