అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం

94
us
- Advertisement -

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఓక్లహోమాలో జరిగిన వేడుకల్లో ఓ దుండగుడు కాల్పులకు తెగబడగా ఇందులో ఒకరు మృతిచెందగా ఏడుగురు గాయపడ్డారు. ఓల్డ్‌ సిటీ స్కేర్‌లో మెమోరియల్‌ డే ఫెస్టివల్‌ జరుగుతుండగా ఈ కార్యక్రమంలో 15 వందల మందికిపైగా పాల్గొన్నారు.

ఈ క్రమంలో జరిగిన చిన్న గొడవతో సహనం కోల్పోయిన స్కైలర్‌ బక్నర్‌ అనే 26 ఏండ్ల యువకుడు ఒక్కసారిగా కాల్పులు జరిపాడు. దీంతో ఓ నల్లజాతి మహిళ అక్కడికక్కడే మృతిచెందింది.

ఇక గతవారమే టెక్నాస్‌లోని ఉవాల్డాలో ఓ లిమెంటరీ స్కూల్‌లో జరిగిన కాల్పుల్లో 19 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్స్‌ మరణించిన సంగతి తెలిసిందే.

- Advertisement -