BJP:గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గుజ్జుల..

27
- Advertisement -

వరంగల్ – ఖమ్మం – నల్గొండ గ్యాడ్యుయేషన్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గుజ్జులా ప్రేమందర్ రెడ్డిని ప్రకటించింది బీజేపీ. రేపు నామినేషన్లకు చివరి తేదీ కాగా ప్రకాశ్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, ప్రేమేందర్ రెడ్డిలలో ప్రేమేందర్ రెడ్డి వైపే మొగ్గుచూపింది బీజేపీ. గత ఎన్నికల్లో సైతం ఇదే స్థానం నుండి పోటీ చేశారు గుజ్జుల.రేపు ఉదయం 11గంటలకు నల్గొండలో నామినేషన్ దాఖలు చేయనున్నారు.

కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న,బీఆర్ఎస్ పార్టీ నుంచి రాకేష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. నల్గొండ – ఖమ్మం – వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్ రెడ్డి వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. ఇక గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. దీంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయగా ఉప ఎన్నిక అనివార్యమైంది.

Also Read:జగన్‌ లేవనెత్తిన ప్రశ్నలకు..సమాధానం చెప్పగలరా?

- Advertisement -