టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న గుజరాత్..

138
GT vs MI
- Advertisement -

ఐపీఎల్ 2022 సీజన్‌లో ఈరోజు ఆసక్తికర పోరు జరగనుంది. గుజరాత్ టైటాన్స్-ముంబై ఇండియన్స్ తలపడుతున్నాయి. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. గుజరాత్ టైటాన్స్ ఎటువంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగుతోంది. ఇక, ముంబై ఇండియన్స్ ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. హృతిక్ సోకిన్ స్థానంలో మురుగన్ అశ్విన్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు.

తుది జట్లు :

ముంబై ఇండియన్స్ : ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ (కెప్టెన్), టిమ్ డేవిడ్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, మురుగన్ అశ్విన్, డేనియల్ సామ్స్, జస్ప్రీత్ బుమ్రా, కుమార్ కార్తికేయ, రిలే మెరెడిత్

గుజరాత్ టైటాన్స్ : వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, ప్రదీప్ సాంగ్వాన్, లూకీ ఫెర్గ్యూసన్, మహమ్మద్ షమీ

- Advertisement -