బీజేపీలో అంత‌ర్గ‌త పోరు.. న‌డ్డా సంచలన వ్యాఖ్య‌లు..

111
jp nadda
- Advertisement -

తెలంగాణ బీజేపీలో అంత‌ర్గ‌త పోరు ఏ స్థాయిలో ఉందో ఆ పార్టీ జాతీయాధ్య‌క్షుడు జేపీ న‌డ్డా చేసిన వ్యాఖ్య‌లు అద్దం ప‌డుతున్నాయి. బీజేపీలో నాలుగు గ్రూపులుండ‌గా, ఎవ‌రైనా ఇత‌ర పార్టీల నుండి వ‌చ్చే నేత‌ల‌కు ఏదో ఒక గ్రూప్ అడ్డుప‌డుతుంద‌న్న ప్ర‌చారం ముందు నుండి జ‌రుగుతుండ‌గా, న‌డ్డా వ్యాఖ్య‌లు అందుకు బ‌లం చేకూరుస్తున్నాయి. బీజేపీలో చేరేందుకు కొత్త వారు వస్తున్నారన్న నడ్డా.. వారిని అడ్డుకోవద్దని సూచించడం హాట్ టాపిక్ గా మారింది. పార్టీలో ఎవరు ఈ చేరికలను నిరాకరిస్తున్నారన్న చర్చ ఇప్పుడు బీజేపీతో పాటు రాష్ట్ర రాజ‌కీయాల్లో జోరుగా సాగుతోంది. దుబ్బాక ఉప ఎన్నిక‌తో పాటు, జీహెచ్ఎంసీలో సూప‌ర్ షో, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ గెలిచిన తరువాత… కాషాయ దళంలోకి భారీగా చేరికలు ఉంటాయని పార్టీ నేతలు చెప్పారు.

కానీ ఒకరిద్దరు మినహా కీలక నేతలెవరూ బీజేపీ తీర్ధం పుచ్చుకోలేదు. పార్టీలోకి చేరికల బాధ్యతలు ఈటలకు కట్టబెట్టారని.. కానీ ఆయన ద్వారా చేరికలు రాష్ట్ర నాయకత్వం చేరికలను ఆహ్వానించడం లేదని ఈటల వర్గం ప్రచారం ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న నేపథ్యంలో జేపీ నడ్డా ఈ కామెంట్స్ చేయడం ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే బండి సంజయ్ పై రఘునందన్ రావు, ఈటల రాజేందర్, వివేక్ వంటి నేతలు అసంతృప్తిగా ఉన్నారన్నా అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. ఈ విషయాలను రఘునందన్ కొట్టిపారేస్తున్నా.. నిప్పు లేకుండా పొగ ఎలా వస్తుందంటూ విశ్లేషకుల నుంచి లాజికల్ పాయింట్స్ బయటకు వస్తున్నాయి.

అయితే, ఈ నేతల ద్వారా బీజేపీలోకి చేరికలు ఉంటె వారి ప్రాధాన్యత పెరుగుతుందనే బండి సంజయ్ వర్గం చేరికలకు నో బోర్డు పెట్టుస్తుందని, ఒక వేళ బండి సంజ‌య్ అండ్ టీం నుండి ఎవ‌రైనా రావానుకున్న అవ‌త‌లి టీం అడ్డుకుంటుంద‌న్న‌ చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే నడ్డా.. బీజీపీలో చేరేందుకు కొత్త వారు వ‌స్తున్నారని, వారిని ఆహ్వానించాల‌ని, అడ్డుకోరాద‌ని సూచించడం. పార్టీలో త‌మ‌కు దక్కుతున్న ప్రాధాన్య‌త‌ను ఇత‌ర నేత‌ల‌తో పోల్చి చూసుకోవ‌ద్ద‌ని చెప్పడం బీజేపీలో బిగ్ డిబేట్ గా మారింది. రాష్ట్రానికి ఓవైపు రాహుల్ వ‌స్తుండ‌టం… కాంగ్రెస్‌లో అవ‌త‌లి పార్టీ నాయ‌కుల‌ను చేర్చుకునేందుకు క‌మిటీ కూడా వేసిన నేప‌థ్యంలో బీజేపీలో ఉన్న అంత‌ర్గ‌త కుమ్ములాట‌ల‌కు న‌డ్డా బ‌హిరంగంగానే జ‌వాబు చెప్ప‌టం హాట్ టాపిక్ గా మారింది.

- Advertisement -