థియేటర్స్‌ ఓపెన్‌…మార్గదర్శకాలివే!

217
prakash javadekar
- Advertisement -

అన్ లాక్‌ 5లో భాగంగా బార్లు,సినిమా థియేటర్లు ఓపెన్ చేసుకోవడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ నెల 15 నుండి థియేటర్లు ప్రారంభంకానుండగా కొన్ని కండీషన్స్ విధించింది కేంద్రం. 50 శాతం ఆక్యుపెన్సీతో మాత్రమే థియేటర్లు నడపాలని, ప్రతి షోకు థియటర్ శానిటైజ్ చేయడం తప్పనిసరి అని మార్గదర్శకాల్లో పేర్కొంది.

()50 శాతం ఆక్యుపెన్సీతోనే థియేట‌ర్స్ న‌డ‌పాలి
()సీట్ల మధ్య కూడా భౌతిక దూరం ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలి
()మార్క్ చేసిన సీట్ల‌లో కూర్చోకుండా చూడాలి
()హ్యాండ్ వాష్ శానిటైజ‌ర్స్ అందుబాటులో ఉండేలా చూడాలి
()ప్ర‌తి ఒక్క‌రితో ఆరోగ్య సేతు యాప్ ఇన్‌స్టాల్ చేయించాలి.
()థ‌ర్మ‌ల్ స్క్రీనింగ్ త‌ప్ప‌ని సరి. క‌రోనా ల‌క్ష‌ణాలు లేని వారిని మాత్ర‌మే అనుమ‌తించాలి
()ఆరోగ్య స‌మ‌స్య‌లు ఏవైన ఉంటే సెల్ఫ్ మానిట‌ర్ చేయాలి
() మ‌ల్టీ ప్లెక్స్‌ల‌లో స్క్రీనింగ్ టైమింగ్స్ వేరేలా ఉండే చూసుకోవాలి.
() డిజిట‌ల్ పేమెంట్ కు ఎక్కువ ప్రాధాన్య‌త ఇవ్వాలి.
()బాక్సాఫీస్, ఇత‌ర ప్రాంతాల‌ని ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిశుభ్రంగా ఉంచాలి.
() ప్రేక్ష‌కుల‌ని బ‌ట్టి కౌంట‌ర్స్ ని పెంచాలి
()ఇంట‌ర్వెల్‌లో ప్రేక్ష‌కులు గుమిగూడ‌కుండా ఉండేలా చూడాలి.
()ఫ్లోర్ మేక‌ర్స్ కూడా భౌతిక దూరం పాటించాలి.
() అడ్వాన్స్ బుకింగ్స్ ఏర్పాటు చేసి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ప్ర‌జ‌లు గుమిగూడ‌కుండా ఉండేలా చూసుకోవాలి
()ఉమ్మివేయడం నిషేదం
() గాలి ఆడేలా ఏర్పాట్లు చేయాలి.
() థియేట‌ర్ లోప‌ల ఫుడ్ డెలివ‌రీ చేయోద్దు, అలానే ప్యాకింగ్ ఫుడ్‌ని మాత్ర‌మే అనుమ‌తించాలి.
() ఫుడ్ కౌంట‌ర్స్ కూడా ఎక్కువ‌గా ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలి
()స్టాఫ్‌కు గ్లౌస్, షూట్స్, మాస్క్, పీపీఈ కిట్స్ వంటివి అందించాలి.
()ఆడియ‌న్స్ కాంటాక్ట్ నెంబ‌ర్ కూడా తీసుకోవాలి.
()వీలైన‌న్ని కౌంట‌ర్స్ ఏర్పాటు చేసేలా చూడండి
()థియేట‌ర్ లో ఏసీ టెంప‌రేచ‌ర్ 24-30 మ‌ధ్య ఉండేలా చూడాలి.
()షో ప్రారంభ‌మయ్యే ముందు, పూర్త‌య్యాక‌, ఇంట‌ర్వెల్ స‌మ‌యంలోను కోవిడ్ నిబంధ‌నల‌కు సంబంధించి అనౌన్స్‌మెంట్ ఇవ్వాలి.

- Advertisement -