వృక్షవేదం పుస్తకం అద్భుతంగా ఉంది: ప్రకాశ్‌ జవదేకర్

188
mp
- Advertisement -

కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ కి వృక్ష వేదం పుస్తకాన్ని అందజేశారు రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్. తెలంగాణలోని అడవులు, ప్రకృతి అందాల చిత్రాలతో కూడిన ‘వృక్షవేదం’ పుస్తకాన్ని ఈరోజు డిల్లీ లో కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ మరియు సహచర రాజ్యసభ సభ్యులు కుమార్ కేట్ కార్, డాక్టర్ అనిల్ జైన్, వినయ్ శాస్త్ర బుద్దె లకు అందజేసిన జోగినిపల్లి సంతోష్ కుమార్.

అడవులు మరియు వృక్షాలకు సంబంధించి వేదాలలో ఉన్న విషయాలను తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఈ పుస్తకాన్ని ప్రచురించారు.ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ మాట్లాడుతూ.. వృక్షవేదం పుస్తకం చాలా అద్బుతంగా ఉందన్నారు.

అడవులు, ప్రకృతి అందాలను ఎంతో అద్బుతంగా చూపించారని తెలిపారు. పర్యావరణ ప్రేమికులకు ఈ పుస్తకం ఎంతో ఆనందాన్ని ప్రజల్లో పచ్చదనం పట్ల చైతన్యాన్ని తీసుకువస్తుందని తెలిపారు. వృక్ష వేదం పుస్తకాన్ని అద్బుతంగా రూపొందించిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థ సభ్యులకు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు.

- Advertisement -