వైట్‌ హౌస్‌లో ట్రంప్‌!

211
donald trump

కరోనా బారీన పడ్డ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఆస్పత్రి నుండి డిశ్చార్జ్‌ అయి వైట్ హౌస్‌ చేరుకున్నారు. గత 72 గంటల్లో ఆయనకు జ్వరం రాకపోవడం,ఆక్సిజన్ స్ధాయి సాధరణంగా ఉండటంతో ఆయన్ని డిశ్చార్జ్ చేశారు.

అయితే ట్రంప్‌కు నెగటివ్ వచ్చిందా లేదా అన్న అంశాలను వెల్లడించడానికి డాక్టర్లు నిరాకరించారు. ఆస్పత్రి నుండి బయటకు వస్తున్న సందర్భంగా సర్జికల్ మాస్క్ ధరించి ట్రంప్ బయటకు వస్తూ అందరికి అభివాదం చేశారు.

కోవిడ్-19కు భయపడవద్దు.. మీ జీవితం ఆధిపత్యం చెలాయించే అవకాశం ఇవ్వొద్దు.. ట్రంప్ పాలనలో అనేక మంచి ఔషధాలు అభివృద్ధి, విజ్ఞానం సాధించాం… 20 ఏళ్ల కిందట కంటే తాను ప్రస్తుతం చాలా బాగున్నానని పేర్కొన్నారు.