ప్రభుత్వ స్కూల్స్‌పై గుజరాత్‌ మంత్రి కామెంట్స్ వైరల్‌!

90
Jitu-Vaghani
- Advertisement -

ఇక్కడ చదువు నచ్చకపోతే ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోండి….గుజరాత్ ప్రభుత్వ స్కూల్స్‌ విద్యార్థులను ఉద్దేశించి ఆ రాష్ట్రమంత్రి జీతా వఘానీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రాజ్‌కోట్‌లో ఓ స్కూల్ బిల్డింగ్ ప్రారంభోత్సవానికి హాజరైన ఆయన…గుజరాత్ లో చదువుకుంటున్న పిల్లలకు ఇక్కడ చదువు ఇష్టం లేకపోతే తమ సర్టిఫికేట్లు తీసుకుని ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోవచ్చని షాకింగ్ కామెంట్స్ చేశారు.

గుజరాత్ లో ఉండే కొందరు వ్యక్తులు, కొందరు పిల్లలు ఇక్కడే వ్యాపారం చేస్తుంటారు. కానీ, ఇతర రాష్ట్రాల్లో ఎడ్యుకేషన్ బాగుందనిపిస్తే ….బెటర్ గా అనిపించే రాష్ట్రానికి లేదా దేశానికి వెళ్లిపోండి…మార్పు కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదు అని పరోక్షంగా ఆప్‌ను సైతం ఉద్దేశించి కామెంట్స్ చేశారు. ప్రస్తుతం వఘానీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

- Advertisement -