ఆర్ఆర్ఆర్ @ 1000 కోట్లు

64
rrr
- Advertisement -

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ – ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. మార్చి 25న విడుదలైన ఈ చిత్రం వసూళ్ల సునామీ ఆగడం లేదు. ఇప్పటివరకు వెయ్యి కోట్ల వసూళ్లను రాబట్టిందని మేకర్స్ ప్రకటించారు.

ఈ నేపథ్యంలో చిత్రబృందం బుధవారం ముంబైలో సక్సెస్‌మీట్‌ నిర్వహించింది. బాలీవుడ్‌ హీరో ఆమీర్‌ఖాన్‌, దర్శక నిర్మాత కరణ్‌ జోహర్‌, రచయిత జావేద్‌ అక్తర్‌ ,హుమాఖురేషీ, జితేంద్ర, సతీష్‌ కౌశిక్‌, అశుతోష్‌ గోవారికర్‌, నిర్మాత డి.వి.వి. దానయ్య తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేక్‌ కోసి సినిమా విజయాన్ని ఘనంగా సెలబ్రేట్‌ చేశారు.

విదేశాలతో పాటు భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ విడుదలై సంచలన విజయం సాధించింది. ఒక్క నైజాంలోనే రూ. 100 కోట్ల వసూళ్లను అందుకున్న తొలి చిత్రంగా నిలిచింది. బాలీవుడ్‌లోనూ రూ. 200 కోట్ల వసూళ్లను రాబట్టినట్టు సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ తెలిపారు.

- Advertisement -