ఒక్క నెలలో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు..

52
gst

2020 డిసెంబర్ నెల గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) వసూళ్ల గణాంకాలను కేంద్ర ఆర్థిక శాఖ ఈరోజు వెల్లడించింది. ఈ మేరకు 2020 డిసెంబర్ నెలలో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు అయినట్లు తెలుస్తోంది. జీఎస్టీ విధానం అమలు తర్వాత ఇదే అత్యధిక వసూళ్లుగా కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. డిసెంబర్‌ నెలలో దేశవ్యాప్తంగా రూ.1, 15, 174 కోట్లు జిఎస్టీ వ‌సూలు అయ్యాయి.

కేంద్ర ఆర్థిక శాఖ లెక్కల ప్రకారం.. సీజీఎస్టీ రూ. 21, 365 కోట్లు, ఎస్ జీఎస్టీ రూ. 27, 804 కోట్లు, ఐజీఎస్టీ రూ. 57, 426 కోట్లు, సెస్ రూపంలో రూ. 8, 579 కోట్లు రూపంలో వసూలు అయ్యాయి. తెలంగాణ జీఎస్టీ వ‌సూళ్ళు రూ. 3, 543 కోట్లు అయింది. గతేడాది డిసెంబర్ నెలతో పోల్చితే తెలంగాణలో 4% జీఎస్టీ వసూలు పెరిగాయి.

2017, జులై 1న జీఎస్టీని తీసుకొచ్చిన త‌ర్వాత ఈ స్థాయి వ‌సూళ్లు ఇదే తొలిసారని ఆర్థిక‌శాఖ వెల్ల‌డించింది. క‌రోనా త‌ర్వాత ఆర్థిక వ్య‌వ‌స్థ శ‌ర‌వేగంగా కోలుకోవ‌డం, జీఎస్టీ ఎగ‌వేత‌దారుల‌పై క‌ఠిన చ‌ర్య‌ల వ‌ల్ల ఈ భారీ వ‌సూళ్లు సాధ్య‌మైన‌ట్లు తెలిపింది. దేశీయ లావాదేవీల‌పై వ‌చ్చిన ఆదాయాల కంటే వ‌స్తువుల దిగుమ‌తి వ‌ల్ల వ‌చ్చిన ఆదాయం 27 శాతం ఎక్కువ‌గా ఉంది. ఒకే నెల‌లో జీఎస్టీ రూ.ల‌క్ష కోట్లు దాట‌డం వ‌రుస‌గా ఇది మూడోసారి.