మంత్రికి శుభాకాంక్షలు తెలిపిన దేవాదాయశాఖ అధికారులు..

26
Indrakaran Reddy

ఈ రోజు నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందులో భాగంగా పీసీసీఎఫ్ ఆర్. శోభ, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, పీసీసీఎఫ్ లు లోకేష్ జైస్వాల్, ఆర్ ఎం డొబ్రియల్, స్వర్గం శ్రీనివాస్, అదనపు పీసీసీఎఫ్ లు పర్గెన్, సిద్దానంద కుక్రేటి, రంగారెడ్డి సీసీఎఫ్ సునీత భగవత్, కొమురవేల్లి, బల్కంపేట, జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి, ఆలయ అధికారులు, వేద పండితులు తదితరులు గచ్చిబౌలిలోని మంత్రి నివాసంలో ఆయనను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.