గిఫ్ట్‌ ఏ స్మైల్‌.. అంబులెన్స్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌..

27
KTR

తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు, రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖామాత్యులు కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా #GiftASmile ఛాలెంజ్‌లో భాగంగా మునుగోడు నియోజకవర్గానికి చెందిన టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు కర్నాటి విద్యాసాగర్ మంత్రి కేటీఆర్‌ను కలిసి 22 లక్షల విలువ గల అంబులెన్స్ ను ప్రజలకు ఇచ్చేందుకు ప్రారంభించారు.

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. సమాజానికి మేలు చేసే కార్యక్రమంలో విద్యాసాగర్ లాంటి యువ నాయకులు భాగస్వాములై సామాజిక సృహను చాటుకొని ఆదర్శంగా నిలుస్తున్నారని, టీఆర్‌ఎస్‌ నాయకులు సొంత డబ్బుతో ప్రజాసేవ చేసే సేవకులని అభినందించారు.

అనంతరం విద్యాసాగర్ మాట్లాడుతూ.. నిరంతరం ప్రజాశ్రేయస్సు కోసం తపించే కేటీఆర్‌ నాయకత్వంలో పనిచేయడానికి గర్వపడుతున్నామని పేర్గొంటూ ఆయన బాటలో ప్రజాసేవకు అంకితమౌతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పల్ల రాజేశ్వర్ రెడ్డి, బాలమల్లు,మేయర్ బోంతు రామ్మోహన్,మునుగోడు నియోజకవర్గ పార్టీ నాయకులు పాల్గొన్నారు.