ఏపీ బీజేపీ గ్రూప్ వార్.. !

19
- Advertisement -

ఏపీలో బలపడేందుకు కమలం పార్టీ ఎప్పటినుంచో గట్టిగా ప్రయత్నిస్తోంది. కానీ కమలనాథుల ప్రయత్నలకు తగినట్లుగా ఫలితాలు మాత్రం రావడం లేదు. ప్రస్తుతం ఏపీలో ప్రధాన పార్టీలుగా వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు ఉండగా బీజేపీ మాత్రం జనసేన మిత్రపక్షంగానే ఉంది తప్పా.. ప్రధాన పార్టీ హోదాకు దూరంగానే ఉంది. దాంతో రాష్ట్రంలో పార్టీని బలపరిచేందుకు హైకమాండ్ విశ్వ ప్రయత్నలే చేస్తున్నప్పటికి రాష్ట్ర కమలనాథుల చర్యలు మాత్రం అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఈ మద్య కాలంలో ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మరియు మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ మద్య జరుగుతున్నా కోల్డ్ వార్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. .

వీరిద్దరి మద్య ఎప్పటి నుంచో విబేధాలు ఉన్నప్పటికి.. ఇటీవల కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆ మద్య పవన్ కు ప్రదాన్యత ఇచ్చే విషయంలో సోము వీర్రాజు నిర్లక్ష్యం వహిస్తున్నారని కన్నా లక్ష్మినారాయణ బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. ఇక సోము కూడా తనదైన రీతిలో కన్నా పై పరోక్ష వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. దీంతో ఏపీ బీజేపీ కన్నా వర్గం వర్సస్ సోము వర్గం అని రెండు వర్గాలుగా విడిపోయాయి. ఇక తాజాగా సోము వీర్రాజు ఆరుగురు జిల్లా అద్యక్షులను మార్చడంతో బీజేపీలోని ముసలం మరోసారి బయటపడింది. అధ్యక్షుల మార్పిడి ఏకపక్షంగా జరిగిందంటూ వారంతా రాజీనామా కూడా చేశారు.

రాజీనామా చేసిన వారిలో శ్రీకాకులం జిల్లా ఇంచార్జ్ చిగురుపాటి కుమారస్వామి తో పాటు మరికొంత మంది కూడా ఉన్నారు. అయితే మార్చిన జిల్లా అధ్యక్షులలో కన్నా వర్గానికి చెందినవారే అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అందుకే సోము వీర్రాజు నిర్ణయానికి వ్యతిరేకంగా రాజీనామాలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంచితే సోము వీర్రాజు అధ్యక్ష బాద్యతలు చేపట్టినది మొదలుకొని పార్టీని బలపరిచేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని, ఆయన అద్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని కన్నా లక్ష్మినారాయణ వర్గం నుంచి వినిపిస్తున్న ఆరోపణలు.. ఇలా సొంత పార్టీలోనే కీలక నేతల మద్య జరుగుతున్నా గ్రూప్ గొడవలు అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. మరి ఈ గ్రూప్ రాజకీయాలు కమలం పార్టీపై ఎలాంటి ప్రభావాలు చూపిస్తాయో చూడాలి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -