GreenIndiaChallenge:గ్రీన్ ఇండియా సృష్టికర్తకు గ్రీన్ రిబ్బన్ అవార్డు

31
- Advertisement -

పచ్చని పర్యావరణం కోసం అలుపెరగని కృషి చేస్తూ దేశవ్యాప్తంగా పచ్చదనం పెంపుపై నిరంతరం అవగాహన కల్పిస్తున్న గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం సృష్టికర్తకు గ్రీన్ రిబ్బన్ ఛాంపియన్‌ అవార్డును అందుకున్నారు. ప్రముఖ మీడియా సంస్థ నెట్‌వర్క్‌ 18గ్రూప్‌ ఈ అవార్డులను ప్రధానం చేసింది. అయితే గత వారం ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంకు అనివార్య కారణాల వల్ల ఎంపీ సంతోష్‌కుమార్‌ హాజరు కాలేకపోయారు. దీంతో ఈ రోజు నెట్‌వర్క్‌ 18గ్రూప్ ప్రతినిధి హైదరాబాద్‌లో కలిసి అవార్డు అందించారు.

పర్యావరణ పరిరక్షణ పచ్చదనం పెంపు సామాజిక స్పృహ, అన్ని వర్గాల ప్రాతినిధ్యానికి కృషి, దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను గ్రీన్‌ అంబాసిడర్లుగా ప్రమోట్‌ చేస్తున్నందుకు బీఆర్ఎస్ ఎంపీ సంతోష్‌కుమార్‌ను గ్రీన్‌ రిబ్బర్ ఛాంపియన్‌గా ఎంపిక చేసినట్లు నెట్‌వర్క్‌ 18గ్రూప్ తెలిపింది. పర్యావరణ మార్పుల వల్ల మానవాళికి పొంచి ఉన్న పెను ముప్పుపై అవగాహన కల్పించేందుకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేస్తున్న కృషి అమోఘమని సంస్థ ప్రతినిధులు అన్నారు.

ఇవి కూడా చదవండి…

వైభవంగా శ్రీరామపట్టాభిషేకం..

RamKiBandi:వరల్డ్ ఫేమస్ రామ్‌ కీ బండి

ఆటా ఉగాది సాహిత్య వేదిక..

- Advertisement -