Grapes:ద్రాక్షతో లాభాలు

397
- Advertisement -

నల్లద్రాక్ష ఆరోగ్యానికి అన్నివిధాలా సహకరిస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయుల్ని అదుపులో ఉంచుతుంది. అధికరక్తపోటును నియంత్రణలో ఉంచుతుందని వైద్యులు చెబుతున్నారు. చదువుకునే వయసులో ఉన్న పిల్లలకు వీటిని తరుచూ తినిపిస్తూ ఉంటే వారిలో ఏకాగ్రత పెరుగుతుంది. జ్ఞాపకశక్తీ మెరుగవుతుంది. నల్లని ద్రాక్ష  పండ్లను తినడం వల్ల వృద్ధాప్య ఛాయలు త్వరగా దరిచేరవు.

ద్రాక్షలో పండ్లలో ఉండే పాలిఫినాల్స్ శరీరంలోని కొల్లాజిన్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది చర్మాన్ని వాడిపోకుండా రక్షించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. చర్మానికి నిగారింపు తెస్తుంది. శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటికి పంపిస్తుంది. చర్మానికి జీవకళను తెచ్చిపెడుతుంది. అలాగే జుట్టుకు కూడా మంచి ఔషధంలా పనిచేస్తుంది. ద్రాక్షలో ఉండే ఫ్యాటీ ఆమ్లాలు వెంట్రుకలకు మంచి పోషణనిస్తుంది.

1. ఎండు ద్రాక్షలో ఓలియోనిక్ యాసిడ్ ఉండటం వల్ల ఇది దంతక్షయాన్ని, చిగుళ్ళ  నుండి   రక్తస్రావాన్ని, దంత సమస్యలను నివారిస్తుంది.

2.ద్రాక్ష రసాన్ని రోజూ తీసుకుంటే ఎముకలు, దంతాలు బలపడతాయి. గుండె  ఆరోగ్యంగా  ఉంటుంది.  ద్రాక్షల్లోని అన్ని రకాలూ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

3. ద్రాక్షల్లో కార్బోహైడ్రేడ్, ప్రోటీనులు, ఐరన్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి.

4.  40 ఏళ్ళకు పైబడిన మహిళల్లో నెలసరి సమస్యలు తలెత్తితే రోజూ ద్రాక్ష పండు రసం  తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

5.   ద్రాక్ష పండ్లలో అధిక చక్కెర ఉంటుంది . విటమిన్ A, విటమిన్ సి లు లభిస్తాయి.

6.  స్పూన్ దాక్షరసం లో స్పూన్ గుడ్డు తెల్లసోన కలిపి ముఖానికి రాసి 10 నిమిషాల  తరువాత కడుక్కుంటే  చర్మం  పొడితగ్గి ,సున్నితంగా మారుతుంది.

7. ప్రతి రోజు దాక్షరసం తీసుకుంటే జలుబు, ప్లూ నుంచి ఉపశమనం పొందవచ్చు.

8.  ఒక గ్లాసు తాజా ద్రాక్షరసంను ప్రతి రోజూ త్రాగడం వల్ల అసిడిటిని తగ్గిస్తుంది. రక్తపోటు పొటును అదుపులో ఉంచుతుంది.

9.   ఆస్తమాతో బాధపడే వారు ఎండు ద్రాక్ష తినడం వల్ల ఆస్తమాను తగ్గించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -