- Advertisement -
నిజామాబాద్ స్ధానిక సంస్ధల ఎన్నికల టీఆర్ఎస్ అభ్యర్ధిగా నామినేషన్ వేసేందుకు నగరానికి చేరుకున్నారు కల్వకుంట్ల కవిత. కామారెడ్డి జిల్లా టేక్రియాల్ క్రాస్ రోడ్డులో కవితకు దారిపొడవునా టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలుకుతున్నారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్లు కవితకు శుభాకాంక్షలు తెలిపారు. ఇందల్వాయి వద్ద కూడా పార్టీ శ్రేణులు పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.కాగా మరికాసేపట్లో నామినేషన్ దాఖలు చేయనన్నారు కవిత.
ఈ కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు , పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గోనున్నారు. అంతకు ముందు హైదరాబాద్ లోని కవిత నివాసంలో వేదపండితులు ఆశీర్వచనాలు అందించారు. నామినేషన్ గడువు రేపటితో ముగియనుంది. అత్యధిక ఓట్లు టీఆర్ఎస్ పార్టీకే ఉండటంతో కవిత ఎన్నిక లాంఛనమే కానుంది.
- Advertisement -