జీపీఎస్ విధానంతో మొబైల్ రైతుబజార్లు నిర్వహిస్తున్నామని తెలిపారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. హైదరాబాద్లో జీపీఎస్ ద్వారా ట్రాక్ చేసి ఈసీఐఎల్ లో ఉన్న మొబైల్ రైతుబజార్ నిర్వాహకుడితో మాట్లాడారు నిరంజన్ రెడ్డి .
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఇండ్లవద్దకే పండ్లు, కూరగాయలు అందేలా చూస్తున్నామని వెల్లడించారు. అవసరం ఉన్న ప్రాంతాలను తెలుసుకుని నాలుగురోజులకు ఒకసారి వాహనాలు వెళ్తున్నాయని తెలిపారు.
మొబైల్ రైతుబజార్లతో అదుపులో కూరగాయలు, పండ్ల ధరలు ఉన్నాయని చెప్పారు. జీపీఎస్ ద్వారా ట్రాక్ చేసి ఈసీఐఎల్ లో ఉన్న మొబైల్ రైతుబజార్ నిర్వాహకుడితో మాట్లాడారు.
తీసుకెళ్తున్న కూరగాయలు, ప్రజల నుండి లభిస్తున్న ఆదరణపై ఆరా తీశారు. మార్కెటింగ్ శాఖ అధికారులు, రైతుబజార్ ఎస్టేట్ల మేనేజర్లకు అభినందనలు తెలిపారు. కీలక సమయంలో మొబైల్ రైతుబజార్లతో ప్రజలకు ఇబ్బందులు దూరం చేశారని.. మొబైల్ రైతుబజార్ల వద్ద కరోనా ప్రబలకుండా సామాజిక దూరం పాటిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. కూరగాయల సేకరణతో పాటు పంపిణీ విధానం అద్భుతంగా చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్ రెడ్డి హాజరయ్యారు.