విమాన ప్రయాణ ఛార్జీలివే..!

419
airfare
- Advertisement -

విమానయాన ప్రయాణ ఛార్జీలను 7 విభాగాలుగా విభజించింది డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. 40 నిమిషాల కన్నా తక్కువ వ్యవధిలో ప్రయాణానికి ఛార్జీలు కనిష్టంగా రూ.2000 గరిష్టంగా రూ.6000 నిర్ణయించారు.

40-60 నిమిషాల మధ్య వ్యవధి ఉన్న విమానయాన ప్రయాణానికి ఛార్జీలు కనిష్టంగా 2,500 గరిష్టంగా 7,500 రూపాయలు కాగా 60-90 నిమిషాల మధ్య వ్యవధి ఉన్న విమానయాన ప్రయాణానికి ఛార్జీలు కనిష్టంగా రూ.3,000 గరిష్టంగా రూ.7,500గా ప్రకటించారు ఏవియేషన్ అధికారులు.

90-120 నిమిషాల మధ్య వ్యవధి కలిగిన విమానయాన ప్రయాణానికి ఛార్జీలు కనిష్టంగా రూ.3,500 గరిష్టంగా రూ.10,000 కాగా 120-150 నిమిషాల మధ్య వ్యవధి ఉన్న విమానయాన ప్రయాణానికి ఛార్జీలు కనిష్టంగా రూ.4,500 గరిష్టంగా రూ.13,000.

150-180 నిమిషాల మధ్య వ్యవధి కలిగిన విమానయాన ప్రయాణానికి ఛార్జీలు కనిష్టంగా రూ.5,500 గరిష్టంగా రూ.15,700 కాగా 180-210 నిమిషాల మధ్య వ్యవధి కలిగిన విమానయాన ప్రయాణానికి ఛార్జీలు కనిష్టంగా రూ.6,500 గరిష్టంగా రూ.18,600. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి విమానయాన ఛార్జీలు కనిష్టంగా రూ.3,500 గరిష్టంగా రూ.10,000గా నిర్ణయించారు.

- Advertisement -